Home ప్రత్యేకం చిరు "ఆచార్య"లో ఆలయం సెట్ ప్రత్యేకతలు ఇవే..!

చిరు “ఆచార్య”లో ఆలయం సెట్ ప్రత్యేకతలు ఇవే..!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. రామ్‌ చరణ్ ‌ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సినిమా ప్రస్థావన వచ్చిన ప్రతిసారి కూడా ఈ సినిమా కోసం వేసిన భారీ టెంపుల్ సిటీ సెట్టింగ్ గురించిన ప్రస్థావన వస్తూనే ఉంది. టెంపుల్ సిటీని 20 ఎకరాల్లో కనివిని ఎరుగని రీతిలో అద్బుతంగా రూ.20 కోట్లతో రూపొందించడం జరిగింది. ఒక్క సెట్టింగ్ కోసం అంత ఖర్చు ఏంటీ అంటూ కొందరు పెదవి విరిచే వారు కూడా ఉన్నారు కానీ ఆ టెంపుల్ సిటీ ప్రత్యేకత సినిమా పై అంచనాలు మరింతగా పెంచుతుంది.

చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్న దాని ప్రకారం ఆచార్య సినిమాలో సగంకు పైగా టెంపుల్ సిటీలోనే జరుగుతుందని అంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు యాక్షన్ సన్నివేశాలు కూడా అందులోనే ఉంటాయని అంటున్నారు. కథలోని కీలక సన్నివేశాలు అన్ని కూడా టెంపుల్ సిటీలో ఉండటం వల్లే అంత భారీ మొత్తంను ఖర్చు చేసి ఆ సెట్టింగ్ ను వేయించినట్లుగా చెబుతున్నారు. సినిమా బడ్జెట్ లో మెజార్టీ భాగం టెంపుల్ సిటీ కోసం ఖర్చు చేశారు అంటే సినిమా లో ఆ సెట్టింగ్ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు