Home ప్రత్యేకం చిరంజీవి సూచన.. ‘లూసిఫర్’ కథలో భారీ మార్పులు!

చిరంజీవి సూచన.. ‘లూసిఫర్’ కథలో భారీ మార్పులు!

మలయాళంలో సూపర్ హిట్‌ విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  జయం మోహ‌న్ రాజా దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు.  అయితే కరోనా సెకెండ్ వేవ్ తో దర్శకుడు మోహన్ రాజాకి మళ్ళీ రెండు నెలలు సమయం దొరికింది. అందుకే మళ్ళీ ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడట. కథలో మరిన్ని మార్పులను మోహన్ రాజా చేస్తున్నారని తెలుస్తోంది. చిరు సూచన మేరకు ఇందులో హీరోయిన్ పాత్రను చేరుస్తున్నారని తెలుస్తోంది.
అయితే హీరోయిన్ పాత్రను కేవలం పాటకు మాత్రమే పరిమితం చేస్తారా లేక కీలక సన్నివేశాల్లో కూడా భాగస్వామిని చేస్తారా అనేది చూడాలి. అలాగే ఈ సినిమా కోసం భారీ తారాగణాన్నే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో యువ నటుడు సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు.  కాగా, సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు