Home సినిమాలు చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ మూవీ మూవీ క్రేజీ అప్‌డేట్!

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ మూవీ మూవీ క్రేజీ అప్‌డేట్!

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రీక‌ర‌ణలో పాల్గొంటున్న చిరంజీవి.. తన 153వ సినిమాగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
మాతృకలో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రను చిరు పోషిస్తున్నారు. కాగా, ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ ను మరో రెండు నెలలు వాయిదా వేయాలని చిరంజీవి భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుందడంతో లూసిఫర్ షూటింగ్ ను మరి కొంతకాలం వాయిదా వేయనున్నారు.
వాస్తవానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే మార్చి రెండో వారం  నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు మరోసారి కూడా వాయిదా పడింది. కాగా, తమిళ ఇండస్ట్రీకి చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మంచి హిట్ సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారు. చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశాడు. ఇక ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు