Home సినిమాలు చిరంజీవి రికార్డును బద్దలుకొట్టిన బాలయ్య.. నందమూరి నటసింహం అరుదైన ఘనత

చిరంజీవి రికార్డును బద్దలుకొట్టిన బాలయ్య.. నందమూరి నటసింహం అరుదైన ఘనత

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ముచ్చటగా మూడో చిత్రంగా ‘అఖండ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 13 ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా పేరును ‘అఖండ’గా ఖరారు చేస్తూ టీజర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ ‘అఖండ’ టైటిల్‌ రోర్‌ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. అఖండ టీజర్‌ విడుదలైన 25 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్‌ రాగా ఆరు రోజులకే 27 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది.

అయితే రెండు నెలల క్రితం విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా టీజర్‌కు మాత్రం ఇప్పటివరకు 19 మిలియన్ల వ్యూసే వచ్చాయి. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ నెల రోజుల్లో 7 మిలియన్ల వ్యూస్‌ మాత్రమే రాబట్టింది. దీంతో ‘అఖండ’గా బాలయ్య విడుదలకు ముందే ఆదరగొడుతున్నాడని సంతోషపడుతున్నారు అభిమానులు. కాగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్‌ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడిగా  వ్యవహరిస్తున్నారు. మే 28న సినిమా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు