Home ప్రత్యేకం చిరంజీవి-మోహన్‌బాబు సర్‌ప్రైజ్‌​ అదుర్స్‌!

చిరంజీవి-మోహన్‌బాబు సర్‌ప్రైజ్‌​ అదుర్స్‌!

విలక్షణ నటుడు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శుక్రవారం విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ టీజర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. “మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా అంటూ చిరు వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమైంది. అతడి రూటే సెపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ ఉంటాడో? ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్‌ స్పెషలిస్టూ చెప్పలేడు” అని కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు గురించి చిరు ఆసక్తిగా చెప్పేశారు.
మరోవైవు “నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని”, “నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌” అని మోహన్ బాబు చెప్పిన డైలాగులు ఎంతగానో అలరించాయి. మెగాస్టార్ వాయిస్‌, కలెక్షన్ కింగ్ నట విశ్వరూపంతో వచ్చిన ఈ టీజర్‌ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు