Home ప్రత్యేకం చిరంజీవి బాటలో వెంకటేష్.. అభిమానులకు భారీ షాక్!

చిరంజీవి బాటలో వెంకటేష్.. అభిమానులకు భారీ షాక్!

క‌రోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా అంతకుముందు విడుదల తేదీలు ప్ర‌క‌టించుకున్న సినిమాలు వరుసగా వాయిదా ప‌డుతూ వస్తున్నాయి. ఇప్ప‌టికే నాగచైతన్య ‘ల‌వ్ స్టోరీ’, రానా ‘విరాట ప‌ర్వం’, చిరంజీవి ‘ఆచార్య‌’తో పాటు మరికొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా విక్టరీ వెంకటేష్‌ నటించిన ‘నారప్ప’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులని పరిగణలోకి తీసుకుని అలాగే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు కుడుటపడగానే అతి త్వరలో సినిమాను విడుదక చేస్తామని ప్రకటిస్తూ ఓ పోస్టును షేర్‌ చేశారు. కాగా, తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘అసురన్‌’ రీమేక్‌గా ‘నారప్ప’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేశ్‌ కు జోడిగా ప్రియమణి నటించారు. సమాజంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కుల వ్యవస్థ, దానివల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు