Home సినిమాలు చిరంజీవి కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్!

చిరంజీవి కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్!

గతకొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫోకస్‌ను సినిమాలపైనే పెట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో పలువురు దర్శకులు చిరంజీవి దగ్గరికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ  షూట్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగానే మెహర్ రమేష్‌తో మరో సినిమా చేస్తున్నారు. అలాగే తని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ ని ఖాయం చేశారు. మోహన్ రాజా స్క్రిప్టు ఫైనల్ టచప్ లో ఉన్నారని సమాచారం. అలాగే  బాబీతోనూ సినిమా చేస్తున్నానని చిరు అధికారికంగా ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబి- మైత్రి సంస్థ మూవీని మరోసారి కన్ఫామ్ చేశారు.

ఇదిలాఉంటే.. కరోనా సెకండ్ వేవ్ లో ఆచార్య చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి స్వయంగా లాక్ డౌన్ విధించుకున్న మెగాస్టార్ ఇప్పుడు వేరే స్క్రిప్టుల పైనా దృష్టి సారించారని సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ చిరు కోసం స్టోరీ రెడీ చేసారట. ఇంతకీ ఎవరా సెన్సేషనల్ డైరెక్టర్ అంటారా..? అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ. అవును.. సందీప్ రెడ్డి వంగ చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ లో రణబీర్ హీరోగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి తదుపరి చిరుకు స్క్రిప్టును వినిపించనున్నారు. రెండు మూడు రోజుల్లోనే చిరుకు సందీప్ స్టోరీ నెరేట్ చేయనున్నారని తెలిసింది.  స్క్రిప్టుతో మెప్పిస్తే ఈ సినిమా ఫైనల్ అయినట్టేనన్న టాక్ కూడా వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు