Home ప్రత్యేకం చిరంజీవి‌పై ప్రశంసల జల్లు కురిపించిన తమిళిసై .. ట్విట్టర్ వేదికగా ఏం చెప్పారంటే..

చిరంజీవి‌పై ప్రశంసల జల్లు కురిపించిన తమిళిసై .. ట్విట్టర్ వేదికగా ఏం చెప్పారంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తరుణంలో  మెగాస్టార్ చిరంజీవి  సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా  ఉచితంగా  కోవిడ్‌-19 టీకా ఇప్పించనున్నామని  ఆయన ఇటీవల వెల్లడించారు.  తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో  ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని  చిరంజీవి తెలిపారు.

ఇదిలాఉంటే.. సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘ దిగ్గజ నటుడు శ్రీ చిరంజీవిగారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్‌లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం’ అని ఆమె చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, గతేడాది కరోనా వైరస్‌  సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేసిన  చిరంజీవి దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు