Home ప్రత్యేకం ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ:

‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ:

నటీనటులు : కార్తీక్, లావణ్య త్రిపాఠీ, మురళీశర్మ,  ఆమని, అనసూయ భరద్వాజ్ తదితరులు నిర్మాతలు : బన్నీ వాసు ; దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి ; సంగీతం : జూక్స్ బిజోయ్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఇప్పటి వరకు పోషించని పాత్రలో కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నారు. శవాల బండికి డ్రైవర్‌గా, బస్తీ బాలరాజుగా కార్తికేయ నటించారు. అలాగే, లావణ్య త్రిపాఠి కూడా వితంతువు పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. బస్తీ బాలరాజుగా కార్తికేయ ఎలా నటించాడు? అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఒక సిటీలో బస్తీ బాలరాజు (కార్తికేయ) అనే యువకుడు శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అక్ పరిసరాల్లో ఎవరైనా మరణిస్తే తన వాహనంలో స్మశానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించే సమయంలో బాలరాజుకు ఫోన్‌ కాల్‌ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన  మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు.. మరోవైపు టీవీలు రిపేరు చేసే మోహన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తో గంగమ్మ సన్నిహితంగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ క్రమంలోనే తల్లిపై కోపం పెంచుకుంటాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు సన్నిహితంగా ఉంది?  భర్తను కోల్పోయిన మల్లిక బస్తీ బాలరాజును ప్రేమించిందా? అనేదే మిగతా కథా….
విశ్లేషణ:
ఈ సినిమా మొత్తాన్ని కార్తికేయ తన భుజాలపై నడిపించాడు. ఓ బస్తీ యువకుడిలా చక్కటి నటనను కనబరిచాడు. అలాగే ముందు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని నటన మరింత మెరుగైంది. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, మురళీ శర్మ తో కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్స్ వీటితో పాటు క్లైమాక్స్ లో కనబరిచిన నటనలతో ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాడు.

ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని  డీ గ్లామ్ రోల్ లో చక్కగా ఒదిగిపోయింది.  కొన్ని కీలక సన్నివేశాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీరితో పాటుగా ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమని కీలక పాత్రలో అలరించారు. కార్తికేయ తల్లిగా ఒదిగిపోయారు. అలాగే మురళీ శర్మ కూడా తన పాత్రకు న్యాయం చేకూర్చారు. ఇంకా ఇతర పాత్రల్లో కనిపించిన భద్రం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు దర్శకుడు కౌశిక్. కానీ అతను అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. జోక్స్ బిజోయ్ సంగీతం బాగుంది. 

ప్లస్ పాయింట్స్:కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటనసంగీతం 
మైనస్‌ పాయింట్స్‌:కథ, కథనంఫస్టాఫ్ కొన్ని సాగదీత సీన్లు
రేటింగ్: 2.75/5

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు