Home సినిమాలు ‘చావుకబురు చల్లగా’.. విడుదల ఎప్పుడంటే..?

‘చావుకబురు చల్లగా’.. విడుదల ఎప్పుడంటే..?

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ‘పూర్తి వినోదానికి సిద్ధం కండి’ అంటూ ట్వీట్‌ చేసింది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం.కాగా,తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌లో లావణ్య, కార్తికేయ బెక్‌పై కూర్చొని ఉన్నారు. బైక్ వెనకాల కూర్చున్న లావణ్యను టచ్ కాకుండా.. కార్తికేయ బైక్ ట్యాంక్ పై కూర్చొని నవ్వుతూ  డ్రైవ్ చేస్తున్నాడు. మరి కార్తికేయ అలా ఎందుకు బైక్‌ నడపాల్సివచ్చిందో తెలియాలంటే మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు