Home ప్రత్యేకం చరిత్ర సృష్టించిన పవన్.. ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా 'వకీల్ సాబ్'

చరిత్ర సృష్టించిన పవన్.. ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా ‘వకీల్ సాబ్’

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, అన‌న్య‌ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ కథానాయిక పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండటంతో వకీల్ సాబ్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

మంగళవారం  ఉగాది సెలవు దినం కావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి. చాలా ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన వకీల్ సాబ్ చిత్రం మరికొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వచ్చేసింది. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ 100 కోట్ల క్లబ్‌లో దర్జాగా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే, లాక్‌డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా రికార్డు సాధించింది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా రానున్న రోజుల్లో మరెన్నో రికార్డ్స్ బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు