Home సినిమాలు చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది.. 'విరాటపర్వం’

చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది.. ‘విరాటపర్వం’

రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుండి ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేశారు చిత్రబృందం. రానా వాయిస్ ఓవ‌ర్‌తో ఈ వీడియో ఉండ‌గా ఇందులో సాయి పల్లవితో పాటు, జాతీయ అవార్డు గెలుచుకున్న నటీమణులు నందితా దాస్ , ప్రియామణి,   చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈశ్వరి రావు మరియు జరీనా వహాబ్, నివేదా పేతురాజ్  ఉన్నారు. విరాట ప‌ర్వంలో వీరి పాత్ర చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నారు. 

ఇక నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా  తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. రివల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ అఫ్‌ లవ్‌ అనే క్యాప్షన్‌ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకోంటుంది. ఏప్రిల్‌ 30 న ‘విరాటపర్వం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు