Home సినిమాలు 'గ‌జ‌కేస‌రి'గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

‘గ‌జ‌కేస‌రి’గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యువ హీరో యశ్. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమాను జాతీయ మీడియా కూడా క‌వ‌ర్ చేస్తుంది. కేజీఎఫ్ సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రాన్ని చేసిన య‌ష్ ఈ మూవీని  జూలై 16న విడుద‌ల చేయ‌నున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యాడు యశ్. 

దీంతో ఆయ‌న న‌టించిన సినిమాలను డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా య‌శ్, అమూల్య‌, సాధు కోకిల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎస్ కృష్ణ తెర‌కెక్కించిన గ‌జ‌కేస‌రి చిత్రాన్ని మార్చి 5న ఇక్కడ విడుద‌ల చేయ‌నున్నారు. 2014 మే 23న ఈ క‌న్న‌డ చిత్రం శాండ‌ల్‌వుడ్‌లో విడుద‌ల కాగా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు  సాయంత్రం 4.05 ని.ల‌కు చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.

శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 5న తెలుగువారి ముందుకు రాబోతుంది. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అమూల్య, అనంత్ నాగ్, సాధుకోకిల, గిరిజా లోకేశ్ నటించిన ఈ సినిమాకి సంగీతం వి. హరికృష్ణ అందించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు