Home వార్తలు గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం: బండి సంజయ్‌

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం: బండి సంజయ్‌

గోల్కొండ కోటపై త్వరలోనే బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బీజేపీకార్యకర్తలు చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు బీజేపీ కార్యకర్తలు కరోనాతో మరణించారని గుర్తుచేశారు. 
కాగా..కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవాస్తవాలను ప్రచారం చేశారని బండి సంజయ్‌ విమర్శించారు.. పారాసిట్మల్‌ టాబ్లెట్లు అంటూ అయోమయానికి గురి చేశారన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను తెరాస.. పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్లెక్లీలపై ప్రధాని ఫొటో లేకపోవడం దారుణమన్నారు. సీఎం వైఖరి వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి జరగటం లేదన్నారు. హైదరాబాద్‌ను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు