Home సినిమాలు గోపీచంద్ కోసం రంగంలోకి దిగిన రానా

గోపీచంద్ కోసం రంగంలోకి దిగిన రానా

అగ్ర దర్శకుడు తేజ దర్శకత్వంలో, గోపిచంద్ హీరోగా ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో గతంలో గోపీచంద్ ‘జయం’ ‘నిజం’ సినిమాలు చేసారు. అయితే ఆ చిత్రాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. అయితే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర ఉందట. అందులో యువ హీరో రానా దగ్గుపాటి నటించనున్నట్లుగా సమాచారం.

అంతకుముందు తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆ అనుబంధంతో తేజ ఈ సినిమాకు రానాని ఒప్పించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకి రానా చేయబోయే పాత్ర ఎంతో కీలకమట. కథను మలువు తిప్పేదిగా ఉంటుందట. అందుకే ఈ పాత్ర చేయటానికి రానా సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. కాగా, ఇందులో హీరోయిన్​గా అనుష్క, కీర్తి సురేశ్​ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. జూన్​ నుంచి ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు