Home సినిమాలు గుమ్మడి వరలక్ష్మీకి 'టక్ జగదీష్' స్పెషల్ బర్త్ డే విషెస్.. వైరల్‌ అవుతున్న నాని పోస్ట్

గుమ్మడి వరలక్ష్మీకి ‘టక్ జగదీష్’ స్పెషల్ బర్త్ డే విషెస్.. వైరల్‌ అవుతున్న నాని పోస్ట్

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నానితో ‘నిన్నుకోరి’ లాంటి హిట్ కొట్టిన శివ నిర్వాణ.. ఇప్పుడు జానర్ మార్చి నేచురల్ స్టార్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్.. ఇలా భారీ తారాగణమే ఉంది.

తాజాగా రీతూవ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. నుదిటిపై సిందూరం పెట్టి ఎమోష‌న‌ల్‌గా నానిని చూస్తున్న స్టిల్ స‌రికొత్త‌గా ఉంది. ఈ చిత్రంలో గుమ్మ‌డి వ‌ర‌ల‌క్ష్మి పాత్ర‌లో రీతూ వ‌ర్మ క‌నిపించ‌నుండ‌గా..నాని ఆమెను గుమ్ము అని పిలుస్తాడ‌ట‌. అయితే, ట‌క్ జ‌గ‌దీష్ లో నాని-రీతూ వ‌ర్మ కాంబోలో వచ్చే రొమాన్స్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలువ‌నుంద‌ని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలావుండగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని అన్నగా సీనియర్ హీరో జగపతి బాబు.. తండ్రిగా నాజర్ కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు