Home టీవీ ఖరీదైన కారు కొన్న అఖిల్.. వారి వల్లే నా కల తీరిందంటూ ఎమోషనల్ పోస్ట్

ఖరీదైన కారు కొన్న అఖిల్.. వారి వల్లే నా కల తీరిందంటూ ఎమోషనల్ పోస్ట్

గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు. అయితే, తాజాగా అఖిల్ సార్ధ‌క్  త‌న క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. 25 ఏళ్ల‌లోపు కారు కొనుక్కుంటాన‌ని ప్రామిస్ చేసిన అత‌ను అది నిజం చేశాడు. ఇది అంత తన కష్టం,  హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చాడు.  అమ్మనాన్న ప్రేమ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాద‌ని చెప్పుకొచ్చాడు. అఖిల్ కారు కొన్న సంద‌ర్భంగా మోనాల్‌, సోహెల్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు, నెటిజ‌న్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

మరోవైపు అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్ తో కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ మోనాల్ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లో అఖిల్ నటిస్తున్నాడని చెప్పేసరికి.. వెంటనే ఓకే చెప్పానని మోనాల్ గజ్జర్ వెల్లడించింది. బిగ్ బాస్‌లో మా ఇద్దరి పెయిర్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే మమ్మల్ని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారని మోనాల్ స్పష్టం చేసింది. కాగా, గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు జాబ్ కోసం వచ్చిన అమ్మాయికి.. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయికి మధ్య నడిచే లవ్ స్టోరీనే ఈ వెబ్ సిరీస్ కథాంశం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు