Home సినిమాలు క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘మాస్ట్రో’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్

క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘మాస్ట్రో’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్

యూత్ స్టార్ నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్‌ హీరోయిన్. తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 30న) నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను, టైటిల్‌ను విడుదల చేశారు మేకర్స్.

కాగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్లకు నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నారు నితిన్‌. ఇది ఒకింత ఆసక్తి రేపుతోంది. అలాగే ఇందులోనే “మాస్ట్రో” అనే టైటిల్ ను రివీల్ చేసారు. ఇక ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు వచ్చే జూన్ 11న విడుదల చేస్తున్నట్టుగా కూడా ప్రకటించేశారు..‘భీష్మ’ చిత్రానికి స్వరాలు సమకూర్చిన మహతి స్వరసాగర్‌ ఈ చిత్రానికి సుమధురమైన బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: సాహి సురేష్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు