అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న బుచ్చిబాబు సానా తన తొలి చిత్రంతోనే హిట్ డైరెక్టర్గా మారిపోయాడు. తనకు భారీ సక్సెస్ను తెచ్చిపెట్టిన మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్లోనే తన తర్వాతి సినిమాలు చేస్తున్నాడు. అయితే బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనేది టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బెస్డ్ స్ర్కిప్ట్ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల ఎన్టీఆర్ను కలిసి బుచ్చిబాబు చిత్ర కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని సమచారం. ఒకవేళ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చివరి దశలో ఉండటంతో ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్తో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.