Home సినిమాలు క్రేజీ అప్‏డేట్: 'స‌లార్'లో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్!

క్రేజీ అప్‏డేట్: ‘స‌లార్’లో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది.దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను ఇటీవలే ప్రారంభించారు.ఈ భారీ యాక్షన్‌ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించనున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, తాజాగా కొత్త పేరు వెలుగులోకి వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉన్న శృతి హాస‌న్ అయితే ప్ర‌భాస్‌కు స‌రైన జోడి అని, రెమ్యున‌రేషన్ విష‌యంలోను ఈ శృతితో పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నిర్మాత‌లు భావించారట‌. అందుకే ఆమెతో సంప్ర‌దింపులు కూడా చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు స‌మాచారం.మరోవైపు ‘సలార్‌’లో విజయ్ సేతుపతి విలన్‌గా చేయబోతున్నారట.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ప్రభాస్‌–విజయ్ సేతుపతి కాంబినేషన్‌ సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు