Home సినిమాలు ‘క్రాక్’ దర్శకుడితో బాలయ్య మూవీ ఫిక్స్.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం..!

‘క్రాక్’ దర్శకుడితో బాలయ్య మూవీ ఫిక్స్.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం..!

నందమూరి నటసింహ బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ చిత్రానికి  తమన్ సంగీతం అందిస్తుండగా… ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పైమిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతానికి పిలుస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ సినిమా తరవాత స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారని సమాచారం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే 2022 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుందని తెలుస్తోంది.కాగా,గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. మరి ఇప్పుడు బాలయ్య కోసం ఆయన ఎలాంటి కథ సిద్ధం చేశారో అన్నది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు