Home క్రీడలు "కోహ్లీతో ప్రారంభమై.. విలియమ్స్‌న్‌తో ముగుస్తుంది.''

“కోహ్లీతో ప్రారంభమై.. విలియమ్స్‌న్‌తో ముగుస్తుంది.”

ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్‌లోని ఏగిస్‌ బౌల్‌ వేదికగా జూన్‌ 18 నుంచి 22వరకు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 3-1 తేడాతో కైవసం చేసుకొని టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్‌ అనలిస్ట్‌ మోహన్‌దాస్‌ మీనన్.. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి, న్యూజిలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు జాతకలుపుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

భారత్ జట్టు సారథి విరాట్‌ కోహ్లి జెర్సీ నెంబర్‌ 18 కాగా.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జెర్సీ నెంబర్‌ 22. అయితే, వీరిద్దరి జెర్సీలు పక్కపక్కన ఉంచితే 18-22గా కనిపిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ కూడా జూన్‌ 18న ప్రారంభమై 22న ముగియనుంది. “ఓ మై గాడ్ ఇది నిజంగా అద్భుతం.. కోహ్లీతో ప్రారంభమై.. విలియమ్స్‌న్‌తో ముగుస్తుంది.” అంటూ మోహన్‌దాస్‌ వివరించాడు. ప్రస్తుతం ఈ లెక్కలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు