Home ప్రత్యేకం కొడుకుతో కలిసి బైక్ పై చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్.. వైరల్ ఫోటోలు

కొడుకుతో కలిసి బైక్ పై చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్.. వైరల్ ఫోటోలు

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. 2020వ ఏడాది ఏప్రిల్‌ 29న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ రెండు సినిమాలు ముగిసిన  తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హీరోగా ఎన్టీఆర్‌ నటించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్ ను కలిసి కథ  వినిపించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రానుందని సమాచారం.

ఇదిలావుంటే.. ఎన్టీఆర్ ఆదివారం నాడు తన రెండో కుమారుడు భార్గవ్ రామ్ తో కలిసి సేదతీరాడు. భార్గవ్‌రామ్‌ను బైక్‌ మీద ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. భార్గవ్ రామ్  కోరిక మేరకు యంగ్ టైగర్ అతన్ని బైక్‌ మీద ఎక్కించుకుని రైడ్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు