Home సినిమాలు కేజీఎఫ్-2 తెలుగు రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?

కేజీఎఫ్-2 తెలుగు రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది‌.  ఈ ఒక్క సినిమాతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం  కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ  సినిమా కోసం అన్ని భాషల  ఆడియన్స్  ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో రెండో భాగం బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ 2 తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలుత కేజీఎప్‌ 1 తెలుగు హక్కుల్ని దక్కించుకున్న వారాహి సంస్థ .. కేజీఎఫ్‌ 2 హక్కులను కూడా అడిగిందట. అయితే నిర్మాతలు ఎక్కువ మొత్తం చెప్పడంతో వారాహి సంస్థ తప్పుకుందట. దీంతో దిల్‌ రాజు రంగంలోకి దిగి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా కోసం దిల్‌ రాజు ఏకంగా రూ.66 కోట్ల భారీ ధరను చెల్లించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు