Home సినిమాలు కేజీఎఫ్‌ 2 బిజినెస్‌ ఎన్ని కోట్లో తెలుసా..చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే!

కేజీఎఫ్‌ 2 బిజినెస్‌ ఎన్ని కోట్లో తెలుసా..చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే!

యావత్తు భారత సినీ పరిశ్రమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ ఒక‌టి. క‌న్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా..ఈ సినిమా తొలి భాగం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన తొలి కన్నడ సినిమాగా నిలిచింది‌. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుందని సమాచారం.

కాగా, ఈ చిత్రాన్ని కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది. ఇదిలా ఉంటే, రాఖీ భాయ్‌ని ఢీకొట్టే అధీర పాత్రను బాలీవుడ్ నటుడు సంజ‌య్ ద‌త్ పోషించారు. మ‌రో కీల‌క పాత్రలో ర‌వీనా టాండ‌న్ క‌నిపించ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఇంకా ప్రకాశ్ రాజ్‌, అనంత్ నాగ్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్రలు పోషించారు. భువ‌న్ గౌడ సినిమాటోగ్రఫి అందించిన ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు