Home సినిమాలు కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' బ్యూటీ

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన అభినయం, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కృతి శెట్టి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి.. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెను ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం.

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్ కేటాయించి భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఊరమాస్ కథతో ప్రేక్షకులను మెప్పించేలా కథ రెడీ చేస్తున్నారట లింగుస్వామి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని, భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు