Home సినిమాలు కళ్ళు చెదిరే ధరకు నాని సినిమా థియేట్రికల్ రైట్స్..!

కళ్ళు చెదిరే ధరకు నాని సినిమా థియేట్రికల్ రైట్స్..!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిప‌ల్లవి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’ నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు 30 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకొస్తున్నారని సమాచారం. అయితే చిత్రబృందం మాత్రం అప్పుడే ఈ హక్కులను అమ్మడానికి సిద్ధంగా లేరట. ఫుల్ గా ప్రమోషన్ చేసిన తర్వాత డిమాండ్ ని బట్టి నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మాలని మేకర్స్ యోచిస్తున్నారట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు