Home ప్రత్యేకం కళ్లుచెదిరే ధరకు అమ్ముడుపోయిన ‘రాధేశ్యామ్‌’ హిందీ థియేట్రికల్ రైట్స్!

కళ్లుచెదిరే ధరకు అమ్ముడుపోయిన ‘రాధేశ్యామ్‌’ హిందీ థియేట్రికల్ రైట్స్!

ప్రభాస్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన  ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. సినిమాలో చివరి షెడ్యూల్‌ మాత్రమే మిగిలుంది. ఇందులో భాగంగా ఓ పాటతోపాటు కొన్ని సీన్లు మాత్రమే షూట్‌ చేయాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. తాజాగా రాధే శ్యామ్ బిజినెస్ కు సంబంధించి కూడా పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఓవర్సీస్ బిజినెస్ పై కూడా ఓ న్యూస్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా రాధే శ్యామ్ హిందీ థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్ గత భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’ హక్కులు సొంతం చేసుకున్న టి సిరీస్ వారే ఈ సినిమా హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు కూడా భారీ మొత్తంలోనే చెల్లించినట్టు సమాచారం. ఫిగర్ అయితే బయటకు రాలేదు కానీ దాదాపుగా సాహో కి చెల్లించిన దరలానే ఉండొచ్చని తెలుస్తుంది. కాగా, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు