Home వార్తలు కరోనా మీటర్ తెలుగు రాష్ట్రాలలో

కరోనా మీటర్ తెలుగు రాష్ట్రాలలో

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు కరోనా పడగ విప్పుతోంది.  

తెలంగాణాలో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1590 కేసులు వచ్చాయి.   ఇందులో 80% కేసులు GHMC లో నమోదైనాయి.  రాష్ట్రంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో కేవలం 1,15,835 మందికి పరీక్షలు చేశారు.  ఇందులో, ఇప్పటి దాకా 23902 మందికి పాజిటివ్ అని తేలింది.  వీటిలో మరణాల శాతం 1.23% (295) కాగా, పరీక్ష చేసిన వారిలో 20.63% (23902) మందికి పాజిటివ్ గా తేలింది.   మరణాల శాతం తక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యం గా తెలంగాణాలో అనేక సమస్యలు వినిపిస్తున్నాయి.  పేషెంట్స్, హాస్పిటల్ లో నుంచి విడుదల చేస్తున్న సెల్ఫీ  వీడియోలు సామాన్య ప్రజలను కలవర పెడుతోంది.  కరోనా కన్నా, కరోనా వస్తే, సరైన సమయానికి ట్రీట్మెంట్ అందుతుందో లేదో అన్న భయం ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది.

Lockdown చేస్తే ధన నష్టం చేయక పొతే ప్రాణ నష్టం – సంకట స్థితిలో ఉన్న ప్రభుత్వం.  మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం తో ముందుకు సాగాలి.  అయితే,రోజు రోజుకి కేసులు పెరగుతుం ఉండటం వలన, హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం భయాందోళనలు కలిగిస్తోంది

కరోనా పరీక్షల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ చాలా ముందుంది.  ఇప్పటి దాకా అక్కడ 10 లక్షల మందికి పైగా పరీక్షలు చేశారు.  అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసు ల పరిస్థితి తెలంగాణ లో భిన్నంగా ఉంది.  ఇప్పటి దాకా ఇక్కడ మరణాల శాతం 1.44% (232) కాగా, పరీక్ష చేసిన వారిలో 1.58% (16102) మందికి మాత్రమే పాజిటివ్ అని తేలింది.

త్వరలో మనమందరం ఈ కరోనా మహమ్మారి నుండి బయట పడాలని ఆశిద్దాం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు