Home సినిమాలు కరోనా ఎఫెక్ట్: ‘విరాట పర్వం’ విడుదల వాయిదా

కరోనా ఎఫెక్ట్: ‘విరాట పర్వం’ విడుదల వాయిదా

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. మావోయిస్టు డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఇందులో నటిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా, ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ‘విరాటపర్వం’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపారు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఇదిలాఉంటే.. కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ లో ఇప్ప‌టికే ల‌వ్‌స్టోరీ, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు వాయిదా ప‌డ్డ సంగతి తెలిసిందే. తాజాగా విరాట‌ప‌ర్వం మూవీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు