Home ప్రత్యేకం కరోనా ఎఫెక్ట్​: వచ్చే ఏడాదికి 'చంద్రయాన్-3' ప్రయోగం వాయిదా!

కరోనా ఎఫెక్ట్​: వచ్చే ఏడాదికి ‘చంద్రయాన్-3’ ప్రయోగం వాయిదా!

కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరింత వెనక్కు వెళ్లింది. ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిటీవహించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తాజాగా వెల్లడించారు. ఈ ప్రయోగం వాయిదాకు కరోనా మహమ్మారి కారణమని… భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ సహా అనేక ప్రాజెక్టులపై దీని ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ మాట్లాడుతూ.. ‘భారత దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్‌-3 ప్రయోగంపై మేం పనిచేస్తున్నాం.. ఇందులో ఆర్బిటర్‌ ఉండదు. ల్యాండర్‌, రోవర్‌ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్‌-2లో పంపిన ఆర్బిటర్‌ను దీని కోసం ఉపయోగిస్తున్నాం.. దీనిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి..దీన్ని 2022 ఏడాది ప్రయోగించే అవకాశం ఉంది’ అని శివన్‌ వెల్లడించారు. ఇక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సన్నాహకంగా తొలి విడతలో నిర్వహించే మానవరహిత అంతరిక్షయాత్ర ఈ ఏడాది డిసెంబరు ఉండొచ్చని శివన్‌ చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే..ఇస్రో 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం ఆఖర్లో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడి ఉపరితలపై దిగుతుండగా 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా కూలిపోయింది. కాగా, పలు గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపాలని ఇస్రో భావిస్తున్న సమయంలో చంద్రయాన్‌-3ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష యాత్రల్లో సత్తా చాటడం ఈ సంస్థకు చాలా కీలకం అని చెప్పొచ్చు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు