దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. తాజాగా రౌద్రం రణం రుధిరం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌తో పాటు అన్ని భాషలకు సంబంధించి ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను తమ సంస్థ దక్కించుకుందని పాన్ మీడియా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇక అంతకుముందు తమిళనాడుకు చెందిన ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ ఈ సినిమాకు సంబంధించిన ప్రసార(థియేటర్) హక్కులు సొంతం చేసుకుంది. గతంలో తెలుగులో ఖైదీ నెం.150తో పాటు రోబో 2.0, దర్బార్ వంటి భారీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సంస్థ వ్యవహరించింది. కాగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13 తెరపైకి రానుంది