Home Uncategorized ఒకేసారి రెండు సినిమాలు.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్!

ఒకేసారి రెండు సినిమాలు.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోనే క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా వచ్చిన మరికొన్ని నెలల్లోనే మరో సినిమాను విడుదల చేయబోతున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజులుగా ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో మొదలు పెట్టి 2022 ఏప్రిల్‌ లో విడుదల చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్.

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, టైటిల్ అది కాదని సమాచారం. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ టైటిల్‌ను ఇటీవలే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించారట. ఏదేమైనా కూడా నెలల వ్యవధిలోనే యంగ్ టైగర్ రెండు భారీ సినిమాలు విడుదల కానుండటంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు