Home క్రీడలు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. కోహ్లీ కంటే కేఎల్ రాహుల్‌కి బెస్ట్ ర్యాంక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. కోహ్లీ కంటే కేఎల్ రాహుల్‌కి బెస్ట్ ర్యాంక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ని ప్రకటించగా.. 697 పాయింట్లతో కోహ్లీ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ సంచలన హిట్టర్ డేవిడ్ మలాన్ 915 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలిచాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవోన్ కాన్వే, మార్టిన్ గ‌ప్టిల్ ఈ తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంకులు సాధించారు. తొలి టీ20లో 99 ప‌రుగులు చేసిన కాన్వే ఏకంగా 46 స్థానాలు ఎగ‌బాకి 17వ స్థానంలో నిల‌వ‌గా.. రెండో టీ20లో 97 ప‌రుగులు చేసిన గప్టిల్ మూడు స్థానాలు ఎగ‌బాకి 11వ ర్యాంకు సాధించాడు. 

మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 736 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. టాప్-10 కనీసం ఒక్క భారత బౌలర్‌ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 614 పాయింట్లతో 13వ స్థానంలో నిలవగా.. జస్‌ప్రీత్ బుమ్రా 593 పాయింట్లతో 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10లో భారత క్రికెటర్లకి ఎవరికీ చోటు దక్కలేదు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు