Home సినిమాలు ఐపీఎల్ 2021 సీజన్ ప్రత్యేకతలేంటో తెలుసా..?

ఐపీఎల్ 2021 సీజన్ ప్రత్యేకతలేంటో తెలుసా..?

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021 సీజన్‌ ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు వేదికలు, మ్యాచ్‌ల తేదీలు ఖరారు చేస్తూ బీసీసీఐ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. మే30వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే స్వదేశంలో జరిగే ఐపీఎల్‌ 14 సీజన్ కు కొన్ని ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

★ ఈసారి ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగనున్నాయి.
★ ఐపీఎల్ 2021 సీజన్‌ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్ రూపంలో మొత్తం ఆరు సిటీలు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
★ ఈ ఏడాది మొత్తం 11 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో ఆరు జ‌ట్లు మూడేసి మ‌ధ్యాహ్నం మ్యాచ్‌ల‌ను ఆడ‌నుండ‌గా.. రెండు జ‌ట్లు రెండేసి మ‌ధ్యాహ్నం మ్యాచ్‌లు ఆడ‌తాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు గం.3.30ని.లకు ఆరంభం కాగా, రాత్రి మ్యాచ్‌లు గం. 7.30లకు ప్రారంభం కానున్నాయి.
★ చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పదేసి మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్, ఢిల్లీలో ఎనిమిదేసి మ్యాచ్‌లు జరగనున్నాయి
★ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్లు తమ సొంత మైదానాలను కోల్పోయాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు