Home క్రీడలు ఐపీఎల్-2021 వేలం: డేవిడ్‌ మలన్‌కి ఊహించని షాక్.. జాక్‌పాట్‌ లేదు

ఐపీఎల్-2021 వేలం: డేవిడ్‌ మలన్‌కి ఊహించని షాక్.. జాక్‌పాట్‌ లేదు

ఐపీఎల్ 2020వ సీజన్ కు సంబంధించిన మినీ వేలం చెన్నైలో జరుగుతోంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ వేలంలో ఉన్నారు. ఈ వేలంలో కొంతమంది విదేశీ క్రికెటర్లు, భారత్ స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే ఈ వేలంలో టీ20 ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌కు ఊహించని షాక్ తగిలింది రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది.

వాస్తవానికి ఈ వేలంలో 125 మంది విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా అందరి కళ్లు మాత్రం డేవిడ్‌ మలాన్‌పైనే ఉండేవి. ప్రస్తుతం మలాన్‌ టీ20 ప్రపంచ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత కొద్దికాలంగా టీ20 మ్యాచ్‌ల్లో రికార్డు లెవల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్‌ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన మలాన్‌ 19 టీ20 మ్యచ్‌లాడి 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు మిగతా లీగ్‌ల్లోనూ మలాన్‌ తన జోరును కొనసాగించాడు. దీంతో మలాన్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్‌లో అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈసారి ఐపీఎల్‌లో మంచి ధర పలికే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ అనూహ్యరీతిలో కేవలం రూ.1.5 కోట్లకే అతన్ని పంజాబ్ జట్టు దక్కించుకోవడం గమనార్హం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు