Home క్రీడలు ఐపీఎల్ 2021 ముంగిట సురేశ్ రైనా మెరుపు సెంచరీ..11ఫోర్లు, 7సిక్సులతో విధ్వంసం

ఐపీఎల్ 2021 ముంగిట సురేశ్ రైనా మెరుపు సెంచరీ..11ఫోర్లు, 7సిక్సులతో విధ్వంసం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అద్భుత శతకంతో సత్తాచాటాడు. లోకల్ టీ20 టోర్నీలో నిజ్వాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సురేశ్ రైనా (104 నాటౌట్: 46 బంతుల్లో 11×4, 7×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో అతను ఆడుతున్న టైటాన్ జెడ్‌ఎక్స్ జట్టు 230 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఆది నుంచే సురేశ్ రైనా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే అర్థ శతకం బాదిన సురేశ్ రైనా.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దాంతో.. అతను ప్రాతినిథ్యం వహించిన టైటాన్ జెడ్‌ఎక్స్ టీమ్  ఘన విజయం సాధించింది. అంతకముందు బౌలింగ్ లో కూడా రైనా అదరగొట్టాడు ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రైనా.. 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

ఇక యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాలతో దూరమైన సురేశ్ రైనా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడబోతున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల రైనాని రిటైన్ చేసుకుంది. కాగా, సురేశ్‌ రైనా ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లాడి 5368 పరుగులు చేశాడు.  ఐపీఎల్‌లో 5వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రైనా రికార్డులకెక్కాడు. ఆగస్టు 15, 2020న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక 2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు