Home ప్రత్యేకం ఐపీఎల్ 2021 ముంగిట సన్యాసి అవతారమెత్తిన ధోనీ.. ఫొటో వైరల్

ఐపీఎల్ 2021 ముంగిట సన్యాసి అవతారమెత్తిన ధోనీ.. ఫొటో వైరల్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సందడి మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ జట్టు సారథి ఎంఎస్‌ ధోనీ శిక్షణ శిబిరంలో అడుగుపెట్టడంతో ఫ్రాంచైజీలో కోలాహలం నిండింది. రెండు రోజుల క్రితం నెట్స్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ధోనీ.. తాజాగా సన్యాసిగా మారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్న ఫొటోని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వాస్తవానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే ఎక్కువగా చర్చ నడిచింది. కెరీర్ తొలి నాళ్లలో జులపాల జుట్టుతో కనిపించిన ధోనీ..ఆ తర్వాత 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేయించుకున్నాడు. ఇక 2020 ఐపీఎల్‌కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించిన ఈ క్రికెట్ దిగ్గజం.. తాజాగా సన్యాసి అవతారంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ధోనీ కొత్త అవతారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ సారి వేలంలో కృష్ణప్ప గౌతమ్‌, మొయిన్‌ అలీని సీఎస్‌కే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చెతేశ్వర్‌ పుజారా, హరి నిశాంత్‌, హరి శంకర్‌, భగత్‌ వర్మను తీసుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు