Home క్రీడలు ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు వీళ్లదే!

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు వీళ్లదే!

మరికొన్ని రోజుల్లో క్రికెట్‌ ప్రేమికులకు పండగే. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 9న ఐపీఎల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా క్రికెట్‌ లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ  ఉంది. ఈ మెగా టోర్నీ ఇంతలా విజయవంతం కావడానికి ఇటు స్వదేశీ ఆటగాళ్లు అటు విదేశీ ఆటగాళ్లు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. వీరందరూ కలిసి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ లీగ్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం…

క్రిస్ గేల్ (175) పరుగులు
ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2013 సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగిన ఈ యూనివర్సల్ బాస్ పుణె వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగులు సాధించి పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ బాదిన గేల్ ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు బౌలర్లపై పాశవికంగా విరుచుకుపడ్డాడు. దింతో ఈ మ్యాచులో ఆర్సీబీ జట్టు 130 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
బ్రెండెన్ మెక్​కలమ్ (158) పరుగులు
2008లో ప్రారంభమైన ఐపీఎల్  తొలి మ్యాచులోనే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెక్​కలమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కోల్​కతా నైట్​రైడర్స్​తరఫున బరిలోకి దిగిన అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో కేవలం 73 బంతుల్లోనే 10ఫోర్లు, 13 సిక్సులతో 158 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. దింతో కోల్​కతా జట్టు 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఏబీ డివిలియర్స్ (133) పరుగులు
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్ 2015లో ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగిన డివిలియర్స్ 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సులతో 133 పరుగులు సాధించాడు. దింతో ఈ మ్యాచ్​లో ఆర్సీబీ 39 పరుగుల తేడాతో మధుర విజయం సాధించింది.
కేఎల్ రాహుల్ (132) పరుగులు
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ లో  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్​ తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించాడు. రాయల్  ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్​లో 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సులతో132 పరుగులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారతీయ ఆటగాడికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. రాహుల్ జోరుతో ఈ మ్యాచ్​లో పంజాబ్  97 పరుగులతో విజయం కైవసం చేసుకుంది.
ఏబీ డివిలియర్స్ (129) పరుగులు
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్  2016 సీజన్​లో రాయల్ ఛాలెంంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి.. గుజరాత్​ లయన్స్​తో జరిగిన మ్యాచ్​లో 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సులతో 129 పరుగులు చేసి పెను తుఫాను సృష్టించాడు. ఏబీ విధ్వంసంతో ఆర్సీబీ జట్టు ఈ మ్యాచులో 144 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు