Home క్రీడలు ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ మొత్తం 52 రోజులపాటు ఈ టోర్నీ జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ సిటీలు మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఏ జట్టుకీ తన సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఫస్ట్ మ్యాచ్‌‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.  ఈ నేపథ్యంలో ఈ లీగ్​లో బ్యాట్స్ మెన్ పై  ఆధిపత్యం చెలాయించి అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
నెంబర్ 1: లసిత్ మలింగా 
శ్రీలంక స్టార్ బౌలర్ యార్కర్ కింగ్ లసిత్ మలింగ ఐపీఎల్ చరిత్రలో గొప్ప బౌలర్​గా పేరు సంపాదించాడు.. ముంబై  ఇండియన్స్ తరఫున ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగిన మలింగా మొత్తంగా 122 మ్యాచ్​లు ఆడి 170 వికెట్లతో చరిత్ర  సృష్టించాడు. ఇందులో 108 వికెట్లు డెత్ ఓవర్లలో తీసినవే కావడం విశేషం.. ముంబై జట్టు 2009లో అతన్ని కొనుగోలు చేయగా 2019 వరకు ఆ జట్టు తరఫునే ఆడాడు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన మలింగ.. 2021 ఐపీఎల్ వేలానికి  ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.
నెంబర్ 2: అమిత్ మిశ్రా 
టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్​లో మొత్తంగా 150 మ్యాచ్​లు ఆడి 7. సగటుతో  160 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న మిశ్రా  ఐపీఎల్ మెగాటోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన వారి జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు..
నెంబర్ 3: పీయూష్ చావ్లా
ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్న సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఐపీఎల్ లో ఇప్పటివరకు 164 మ్యాచ్​లు ఆడి..7.87 సగటుతో 156 వికెట్లు పడగొట్టాడు.. అలాగే లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో  స్థానంలో నిలిచాడు.
నెంబర్ 4: డ్వేన్ బ్రావో
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈ మెగా టోర్నీ లో మొత్తం 140 మ్యాచ్​లాడి.. 8. సగటుతో 153 వికెట్లు పడగొట్టాడు.. అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన  బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే ఐపీఎల్ లో లసిత్  మలింగ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో పేసర్ బ్రావోనే కావడం విశేషం.
నెంబర్ 5: హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ టోర్నీ చరిత్రలో మొత్తం  160 మ్యాచ్​లాడి 7. సగటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన  బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 2020 ఐపీఎల్ సీజన్ కు  వ్యక్తిగత కారణాల వల్ల  దూరమైన హర్భజన్ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2021 మినీ వేలం ముంగిట  విడుదల చేసింది. దీంతో ఇతడిని కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు దక్కించుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు