Home క్రీడలు ఐపీఎల్‌లో ‌ఆల్‌ టైమ్ బెస్ట్ ఆల్‌రౌండర్లు వీరే!

ఐపీఎల్‌లో ‌ఆల్‌ టైమ్ బెస్ట్ ఆల్‌రౌండర్లు వీరే!

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2021వ సీజన్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.  కరోనా సంక్షోభంలో సైతం అభిమానులకు వినోదాన్ని అందించడానికి సన్నద్ధమైంది ఈ మెగా టోర్నీ. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలో ఉన్న టాప్-5 అత్యుత్తమ ఆల్‌రౌండర్లు ఎవరో  ఓ లుక్కేద్దాం….

నెంబర్ 1: .కీరన్‌ పొలార్డ్‌  {ముంబయి ఇండియన్స్ }
ఐపీఎల్ లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ముంబై ఇండియన్స్ విధ్వంసకర ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.   ఐపీఎల్ 2010 సీజన్ లో ముంబయి ఇండియన్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పొలార్డ్‌ అప్పటి నుంచి ముంబై జట్టులోనే కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్మురేపే సత్తా ఉన్న పోలార్డ్ ముంబై జట్టుకి ఒంటి చేత్తో ఎన్నో మధుర విజయాల్ని అందించాడు.. ఇక ఐపీఎల్ లో ఇప్పటి వరకు 164 మ్యాచులాడిన పోలార్డ్ 149.87 స్ట్రెక్‌రేట్‌తో 3,023 పరుగులు చేశాడు.. ఇందులో 15 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.. అలాగే బౌలింగ్‌లోనూ పోలార్డ్  60 వికెట్లు తీశాడు…
నెంబర్ 2: డ్వాన్‌‌ బ్రావో {చెన్నై సూపర్ కింగ్స్}
ఐపీఎల్ 2008 సీజన్ నుంచి 2010 సీజన్ వరకు ముంబయి ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన డ్వాన్ బ్రావో 2011 సీజన్ నుంచి  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు..లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి మెరుపులు మెరిపించే  బ్రావో.. అటు బౌలింగ్ లో డేట్ ఓవర్లు వేయడంలో సిద్ధహస్తుడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు  140 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన డ్వాన్‌‌ బ్రావో‌ 1,490 పరుగులు చేశాడు.  ఇందులో 5 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి..  అలాగే బౌలింగ్ లోను‌‌ బ్రావో 153 వికెట్లు పడగొట్టాడు…
నెంబర్ 3: షేన్‌ వాట్సన్ {చెన్నై సూపర్ కింగ్స్}
ఐపీఎల్‌ ఆరంభ సీజన్ 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్‌ రాయల్స్ తరఫున ఆడిన షేన్‌ వాట్సన్.. ఆరంభ  సీజన్‌లో  రాజస్థాన్ జట్టు ఆ జట్టు ట్రోఫీ గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్  2016, 2017లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడి చక్కటి‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగిన ‌ వాట్సన్  2018లో చెన్నై విజేతగా ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో గెలవడంలో ముఖ్య  పాత్ర పోషించాడు.. ఇక ఐపీఎల్ లో మొత్తం 145 మ్యాచ్చులాడిన వాట్సన్  31 సగటుతో 3,874 పరుగులు సాధించాడు. అందులో 4 శతకాలు,21 అర్థ శతకాలు ఉన్నాయి. అలాగే  బౌలింగ్ లోవాట్సన్ 92 వికెట్లు తీశాడు..
నెంబర్ 4: రవీంద్ర జడేజా  {చెన్నై సూపర్ కింగ్స్}
ఐపీఎల్ లో 2008 నుంచి ఆడుతున్న రవీంద్ర జడేజా 2010 వరకు రాజస్థాన్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత  2011లో కొచ్చి టస్కర్స్‌ కేరళ తరఫున బరిలోకి దిగిన జడేజా అద్భుత  ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఐపీఎల్ 2012 సీజన్ లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జడేజా అటు బ్యూటుతో ఇటు బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు . ఈ క్రమంలోనే  ఐపీఎల్ లో మొత్తం 184 మ్యాచులడిన జడేజా 2,159 పరుగులు చేసాడు..అలాగే బౌలింగ్ లో  7.67 సగటుతో 114 వికెట్లు తీశాడు..
నెంబర్ 5: హార్దిక్ పాండ్య {ముంబై ఇండియన్స్}
ఐపీఎల్ 2015 సీజన్ లో ముంబయి ఇండియన్స్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌ పాండ్య..ఆనతి కాలంలోనే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు..  అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే హార్దిక్ పాండ్య ‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 80 మ్యాచ్చులాడి 159.26 స్ట్రెక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు.ఇందులో 4 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే  బౌలింగ్ లో పాండ్య 42 వికెట్లు పడగొట్టాడు…

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు