Home సినిమాలు ఐదేళ్ల తర్వాత ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా

ఐదేళ్ల తర్వాత ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా

తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బన్నీకి మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వీరి కాంబో మళ్ళీ రిపీట్ కానుందని తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే బోయపాటి బన్నీ కోసం ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు బోయపాటి శ్రీను, బాలయ్యతో తెరకెక్కిస్తున్న అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు