Home ప్రత్యేకం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాధే. యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ట్రైలర్ వచ్చేసింది. డ్రగ్ మాఫియాను అంతం చేసే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా విభిన్న గెటప్ లో సల్మాన్ ఆకట్టుకుంటున్నాడు. తన సినిమాలలో తెలుగు చిత్రాల రెఫరెన్స్ వాడుకునే సల్లూ భాయ్.. రాధే కోసం తెలుగు పాటను రీమిక్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన డీజే-దువ్వాడ జగన్నాథం చిత్రంలోని సీటీమార్ అనే సాంగ్ ని ఇందులో రీమిక్స్ చేశారు. ఈ పాటలో దిశా పటానీతో కలిసి సల్మాన్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందీలో కూడా దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సమకూర్చినప్పటికీ.. కొరియోగ్రఫీ కూడా తెలుగు పాటనే పోలి వుండటం గమనార్హం.

ఇంతకముందు సల్మాన్ ఖాన్ తెలుగులో హిట్ అయిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలానే రెడీ, కిక్ చిత్రాలను అదే పేరుతో రీమేక్ చేశారు. స్టాలిన్ చిత్రాన్ని జయహో పేరుతో తెరకెక్కించారు. ఇక ఆర్య 2 సినిమాలోని రింగ రింగ పాటను రెడీ చిత్రం కోసం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాధే కోసం మరోసారి బన్నీ నటించిన సినిమాలోని పాట ట్యూన్ ను సల్మాన్ వాడుకున్నాడు. సౌత్ డైరెక్టర్ ప్రభుదేవా రూపొందించిన సినిమా కావడం వల్లనో ఏమో ఈ ట్రైలర్ లో సన్నివేశాలు డైలాగ్స్ తెలుగు సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. సౌత్ కొరియన్ మూవీ వెటరన్ కు రీమేక్ అని చెప్తున్నప్పటికీ.. హీరో క్యారెక్టరైజేషన్ – డైలాగులు చూస్తుంటే పోకిరి చిత్రానికి సీక్వెల్ లా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రాధే సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు