యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం షరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్19న విడుదల కానుంది.
ఇదిలాఉంటే.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా తెరకెక్కించి భారీ హిట్ ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ మూవీ రూపొందనుంది. ఈ రోజు (ఏప్రిల్ 8) అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏజెంట్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి అఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ ‘ఏజెంట్’ మూవీ రూపొందనుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు