Home టీవీ 'ఎవరు మీలో కోటీశ్వరులు' నుండి లీకైన ఎన్టీఆర్‌ లుక్‌.. హోస్ట్‌గా తారక్‌ అదుర్స్‌

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ నుండి లీకైన ఎన్టీఆర్‌ లుక్‌.. హోస్ట్‌గా తారక్‌ అదుర్స్‌

బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. నాగార్జున హోస్ట్‌గా రూపొందిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మాన్ని ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులుగా మార్చి జెమినీ టీవీ స‌రికొత్త షో ప్లాన్ చేస్తుండ‌గా, దీనిని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఇటీవలే  బిగ్గెస్ట్ మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని పూర్తిగా రివీల్ చేయ‌కుండా, షాడో రూపంలో చూపించారు.

అయితే, తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎన్టీఆర్ ప్రోమోకి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ బ్లేజర్ ధరించి న్యూ హెయిర్ స్టైల్ తో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ట్రిమ్ చేసిన గడ్డం మీసాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. హోస్టుగా మరోసారి యంగ్ టైగర్ అదరగొడతాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మార్చి 13న ఎన్టీఆర్ హోస్ట్ అనే విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్‌కు సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేశారు. అయితే ఈ మెగా షో కోసం ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు ఎన్టీఆర్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు