Home ప్రత్యేకం ఎలాన్‌ మస్క్‌కు ఊహించని షాక్.. ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

ఎలాన్‌ మస్క్‌కు ఊహించని షాక్.. ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

ఎలాన్‌ మస్క్‌కు ఊహించని షాక్.. ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు ఊహించని షాక్ తగిలింది.. బిట్‌కాయిన్‌లపై ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15.2 బిలియన్‌ డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ. 1.10లక్షల కోట్లు) కోల్పోయారు. గతకొంతకాలంగా బిట్ కాయిన్ విలువ జెట్ స్పీడుతో దూసుకెళ్తుంది. 

అయితే, బిట్ కాయిన్ షేర్ విలువ పెరుగుతుండడంపై ట్విటర్  లో ఎలాన్ మస్క్ స్పందించారు. “బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని” ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు. దీనితో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు.  ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు(సుమారు లక్ష కోట్లు) కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, తాజా పతనంతో మస్క్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్లు తగ్గి 183.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు