Home ప్రత్యేకం 'ఎఫ్ 3' : వెంకటేష్, వరుణ్ తేజ్ రికార్డ్ బ్రేకింగ్

‘ఎఫ్ 3’ : వెంకటేష్, వరుణ్ తేజ్ రికార్డ్ బ్రేకింగ్

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహరీన్‌ నాయికలు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మేజర్ టాకీ పార్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్‌ తేజ్  మధ్య వచ్చే సీన్స్‌ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారట. అసలు ఇంత త్వరగా టాకీ పార్ట్ పూర్తవుతుందని చిత్రబృందం అనుకోలేదని ..ఈ ఉత్సాహంతో మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌-వరుణ్‌ కలయికలో గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతుందీ ‘ఎఫ్‌ 3’. ఎఫ్‌ 2 మంచి విజయం అందుకోవడంతో ఎఫ్‌ 3పై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వెంకీ నటించిన నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ఇప్పటికే విడుదల తేదీలు ఖరారు కాగా.. ఈ రెండు సినిమాల మధ్యలో దృశ్యం 2ని విడుదల చేసేందుకు వెంకటేష్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. జూన్ చివరి నాటికి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి జూలైలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు