Home సినిమాలు 'ఎఫ్ 3' విడుదల అయ్యేది అప్పుడే.. సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న అనిల్ రావిపూడి

‘ఎఫ్ 3’ విడుదల అయ్యేది అప్పుడే.. సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న అనిల్ రావిపూడి

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహరీన్‌ నాయికలు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌-వరుణ్‌ కలయికలో గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతుందీ ‘ఎఫ్‌ 3’. ఎఫ్‌ 2 మంచి విజయం అందుకోవడంతో ఎఫ్‌ 3పై అంచనాలు పెరుగుతున్నాయి.   ఇదిలాఉంటే.. ఎఫ్ 3 సినిమాను ఆగస్టు 27న విడుదల చేస్తామని చిత్రబృందం ముందుగా ప్రకటించారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది.
దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో సెంటిమెంట్ ను నమ్ముకున్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా అద్భుత విజయం సాధించింది. దీంతో ఎఫ్ 3ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తే మంచిదని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు