Home ప్రత్యేకం 'ఎఫ్‌3': ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వనున్న వెంకీ.. మరింత ఫన్ ఖాయం

‘ఎఫ్‌3’: ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వనున్న వెంకీ.. మరింత ఫన్ ఖాయం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంక‌టేశ్ సినిమా అంటే కామెడీకి కొద‌వే ఉండ‌దు. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఎఫ్ 3 సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టులో విడుదల కాబోతున్నట్లు ప్రకటించేసారు చిత్రబృందం. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని సమాచారం.శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్‌2 సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్ డేట్ ఒక‌టి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ రేచీకటి కలిగిన పాత్రలో నటిస్తున్నాడట. ఈసారి వెంకటేష్ క్యారెక్టర్ చాలా కొత్తగా వెరైటీగా డిజైన్ చేసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే ఎఫ్2తో వెంకీ కామెడీ టైమింగ్ వాడుకున్నాడు. ఇప్పుడు అదే వెంకీ టైమింగ్ తో రేచీకటి అనే కొత్త పాయింట్ యాడ్ చేసాడట. రేచీకటికి సంబంధించిన షూట్ ఇదివరకు పూర్తి చేశారట. ప్రస్తుతం వెంకీ ఓవైపు నారప్ప సినిమా చేస్తూనే మరోవైపు ఎఫ్3 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తమిళ అసురన్ సినిమాను నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు