Home సినిమాలు ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో.. బ్లాక్ బస్టర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో.. బ్లాక్ బస్టర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన తరవాత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని వేచి చూస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలకమైన హీరో స్నేహితుడి పాత్రను యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో చేయించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పోటీ పడి నటించాలంటే కేవలం నవీన్ వల్లే అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అందుకే అతన్ని ఎంపిక చేసినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నవీన్ ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం అతడు నటించిన జాతిరత్నాలు సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో నవీన్ ఉబ్బితబ్బిబయిపోతున్నాడట. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట.

కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరో హీరో. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు